నేటి సాక్షి,,నారాయణపేట, జనవరి 17, (రిపోర్టర్ ఇమామ్ సాబ్)నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని మందిపల్లిలో ప్రీమియర్ లీగ్‌లో విజేతలుగా నిలిచిన భీమ్ వారియర్స్ జట్టును ఉప సర్పంచ్ నరేష్, (డీస్పీ మండల అధ్యక్షులు),జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్, మాజీ సర్పంచ్ కనకం వెంకటయ్య,3, 8, 10 వార్డు సభ్యులు కలిసి సన్మానించడం జరిగింది.బొల్లి శ్రీనివాసులు తన తరఫున రూ,1100 నగదు బహుమతిని జట్టుకు అందజేశారు.ఈ సందర్భంగా మల్లికార్జున్, నరేష్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ఆటగాళ్లకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. క్రీడల ద్వారా గ్రామానికి మంచి పేరు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

