నేటి సాక్షి, నారాయణపేట, ఫిబ్రవరి 8, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్) పదవ తరగతి విద్యార్థులకుషేర్ కృష్ణారెడ్డి పారిజాత ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పూసల్ పహాడ్టాలెంట్ టెస్ట్ ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఈ పరీక్ష 2002 సంవత్సరం నుంచి రెండు దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగుతున్నది.జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీ పరీక్షలోమరికల్ మండలం నుండి 250 విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. ఇలాంటి పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని తెలిపారు. ఈ పోటీ పరీక్ష ఫలితాలను త్వరలోనే ప్రకటించివిజేతలకు బహుమతులు అందించబడుతుందని తెలియజేశారు.ఈ మండలంలో పరీక్ష నిర్వహణలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు రవి వర్మ,విశ్వనాథ్ గౌడ్, రవీందర్ నాయక్,అశోక్ రెడ్డి,రఘు రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.





