*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండల కేంద్రంలోని పిఎన్ఆర్ గార్డెన్లో ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించగా విజయవంతంగా ముగిసాయి. రెండు మండలాల ఆడపడుచులు పాల్గొన్నారు. పాల్గొన్న ఆడపడుచులు అందరికీ ప్రోత్సాహక బహుమతులు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అందించారు. ప్రత్యేక బహుమతులుగా మొదటి బహుమతిగ మేడిపల్లి కి చెందిన ఆషాడపు స్రవంతి, రెండవ బహుమతి భీమారం కి చెందిన గుండేటి రవలి, మూడవ బహుమతి మేడిపల్లి జుంబర్తి ప్రసన్న విజేతలను మేడిపల్లి ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి, దంపతులు విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యుడు మకర రాశికి లోకి సంక్రమించడంతో మకర సంక్రాంతిగా కొత్త వెలుగులతో సంక్రాంతి పండగను జరుపు కుంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మేడిపల్లి మండలప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఏదులాపురం దయాకర్, గౌరవ అధ్యక్షులు చింతకింది లక్ష్మీపతి, ప్రెస్ క్లబ్ సభ్యులు, గ్రామ సర్పంచ్ మకిలి దాసు, ముఖ్య అతిథులు ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి దంపతులు, భీమారం మండల ఎంపీడీవో నీరజ, ఆయా పార్టీల మండలాల అధ్యక్షులు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చేపూరి నాగరాజు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గుగ్గిళ్ళ రమేష్, సర్పంచులు సట్టా భూమేష్, పెటైరి రోజా నాగరాజు, యాగండ్ల మంజుల శ్రీనివాస్ గౌడ్, వేముల లింబాద్రి, ఉప సర్పంచ్ అర్జున్, తదితరులు పాల్గొన్నారు.

