Tuesday, February 24, 2026

*విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి**జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* మంచిర్యాల జిల్లా,, ఫిబ్రవరి 23,

నేటి సాక్షి నిరుపేద లబ్ధిదారులకు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం క్రమ మార్గంలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య తో కలిసి విజిలెన్స్ కమిటీ సభ్యులు, జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం ను అర్హులైన లబ్ధిదారులకు చేరేలా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. 2026 జనవరి నెలలో 2 లక్షల 54 వేల 21 రేషన్ కార్డులలో 7 లక్షల 52,492 యూనిట్లకు గాను 96.30 శాతంతో 4 వేల 313 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 100 శాతం రాయితీతో రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని, రేషన్ డీలర్లు అర్హత గల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ పరిధిలోని రేషన్ షాపులను ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తారని, రేషన్ డీలర్లు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 1955, 6 ఎ సెక్షన్ క్రింద 13 కేసులు నమోదు చేయడం జరిగిందని, జిల్లాలో వివిధ కేటగిరీల క్రింద మొత్తం 423 చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 969 అంగన్వాడీ కేంద్రాలకు 40 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, మధ్యాహ్న భోజన పథకం కింద జిల్లాలోని 988 పాఠశాలలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్య అభ్యసిస్తున్న 40 వేల 759 మంది విద్యార్థుల కొరకు 80 మెట్లు ధాన్యం పంపిణీ చేయడం జరుగుతుందని, 112 సంక్షేమ సంస్థలు, వసతి గృహాలకు 320 మెట్రిక్ టన్నుల ధాన్యం సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని, రేషన్ బియ్యం తప్పుదారి పట్టకుండా పర్యవేక్షించాలని, రేషన్ బియ్యం దుర్వినియోగపరచిన లబ్ధిదారుల రేషన్ కార్డులు రద్దు చేయబడతాయని తెలిపారు. రేషన్ కార్డులలో చనిపోయిన వారి వివరాలు తొలగించాలని, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడి కేంద్రాలలో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News