*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )విద్యాభివృద్ధి లక్ష్యంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టడం అభినందనీయమని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేని అన్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని శిశుమందిర్‌లో సోమవారం రెండు అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.*సొంత నిధులతో నిర్మాణం*నిమిషకవి నవీన్–దివ్య, గోనె సురేందర్–మేఘన దంపతులు విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ సొంత నిధులతో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణాల ప్రారంభోత్సవానికి బీజేపీ జిల్లా, రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.*సమాజానికి ఆదర్శం*ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తరగతి గదుల నిర్మాణం చేయడం నిజంగా ప్రశంసనీయం అన్నారు. ఇలాంటి సేవాభావం ప్రతి ఒక్కరిలో ఉండాలని, నిమిషకవి నవీన్–దివ్య, గోనె సురేందర్–మేఘనలను సమాజం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టిన దాతలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు చిట్నేనిలను నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో అయిలాపూర్ గ్రామ ఉపసర్పంచ్ వనపర్తి సౌమ్య క్రాంతి, విద్య పీఠం కరీంనగర్ ఇంచార్జీ కాటం రవీందర్, జిల్లా కార్యదర్శి బండారి కమలాకర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వేముల ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యం, కోరుట్ల అధ్యక్షుడు వేముల రవి కిరణ్‌తో పాటు స్థానిక నాయకులు రమేష్, రాములు, గోపి, రాజు, సురేష్, సుదర్శన్, తుకారం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.—–

