నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)ఎస్ఎఫ్ఐ టౌన్ ఉపాధ్యక్షుడు అంజిత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని మరియు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని గోదావరిఖని హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.సందర్భంగా టౌన్ ఉపాధ్యక్షుడు అంజిత్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్య రంగానికి తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీలు ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఇవ్వవలసిన స్కాలర్షిప్ ఫీజు రియంబేర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు భరోసా కల్పిస్తూ రియంబర్స్మెంట్ పథకం తీసుకురావడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ పథకాన్ని తీసివేసే కుట్ర జరుగుతుంది ఇది సరైనది కాదని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న 8025 కోట్ల బకాయిలు విడుదల చేయాలి అని అన్నారు. పేద విద్యార్థుల పట్ల ఎందుకు కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు, ఇప్పటికే ప్రభుత్వం యజమానాలతో గతంలో చర్చలు జరిపి దసరా దీపవళి 1200 కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు విడుదల చేయలేదు,యాజమాన్యంలు 3 నుండి కళాశాల నిరవధిక బంద్ కు పిలుపునివ్వడం జరిగింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు తక్షణమే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు హర్షిత్, కౌశిక్,బాలయోగి, అంజి,వర్ధన్,చరణ్,ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.





