Tuesday, March 10, 2026

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలివిద్యార్థులతో కలిసి భోజనం చేసిన జెడ్పి సిఇఓ


నేటిసాక్షి, రాయికల్ :
విద్యార్థులకు నాణ్యమైన ఆహరం అందించాలని జగిత్యాల జెడ్పి సిఇఓ, రాయికల్ మండల ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి వసతి గృహ సిబ్బందికి సూచించారు. రాయికల్ మండలం అల్లీపూర్ మహత్మ జ్యోతిభాఫూలే బిసి రెసిడెన్సియల్ పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటగదిని పరిశీలించి సరుకుల వివరాల రికార్డులు, భోజన నాణ్యతను పరిశీలించారు. ఆనంతరం విద్యార్థులతో కలిసిభోజనం చేసారు. డైనింగ్హాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. వీరి వెంట ఎంపిడిఓ చిరంజీవి, ప్రిన్సిపల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. కాగ రాయికల్ మండలం ఉప్పుమడుగు కెజిబివి బాలికల పాఠశాలను ఎంపిడిఓ చిరంజీవి సందర్శించారు. విద్యార్థుల భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి భోజనం చేసారు.
ఫోటో రైటప్: :27RKL01: విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న జెడ్పి సిఇఓ గౌతంరెడ్డి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News