Saturday, March 7, 2026

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల, పెన్నులు పంపిణీ…. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్…. ఆవుటి ఉషారాణి వసంత కుమార్ అంగన్వాడి టీచర్…..

నేటి సాక్షి,నారాయణపేట, మార్చ్ 6, ( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ లో శుక్రవారం రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ లో జాజాపూర్ గ్రామానికి చెందిన ఆవుటి ఉషారాణి వసంత కుమార్ దంపతుల అంగన్వాడి టీచర్ పదో తరగతి 82 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను మరియు పెన్నులను పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఆవుటి ఉషారాణి మాట్లాడుతూ….. పదో తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని విద్యార్థులకు పదవ తరగతి చాలా కీలకమైనదని మంచి మార్కులు సాధించడం ద్వారా ఉన్నత విద్యకు గట్టి పునాది అవుతుందని విద్యార్థులు భవిష్యత్తులో పదో తరగతి ఉత్తీర్ణులై తమకిష్టమైనటువంటి కోర్సును ఎన్నుకొని జీవితంలో రాణించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు ప్యాడ్లను పెన్నులను పంపిణీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ భాను ప్రకాష్ లక్ష్మణ్ నరసింహ నర్సింలు ప్రతాప్ నిర్మల శశిరేఖ ,శ్రీదేవి,వెంకటేష్ పాఠశాల ప్రధానో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News