నేటిసాక్షి, నారాయణపేట, జూన్ 16, నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాములను నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం ఫర్నికా రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ చిట్యం పర్ణిక రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాములను అందే విధంగా చూడాలని అధికారులకు ఆమె ఆదేశించారు. అనంతరం పేట ఎమ్మెల్యేకు శాలువాలు పూలమాలతో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

