నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………….ఈ రోజు ZPHS ధరూర్ క్యాంప్ పాఠశాలలో పోలీస్ శాఖ వారిచే సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైబర్ క్రైమ్ విభాగం అధికారులు మురళి గారు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు టెక్నాలజీ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల నుండి వచ్చిన ఎలాంటి లింక్ ఓపెన్ చేయకూడదని, ఇంట్లో తల్లిదండ్రుల ఫోన్ వాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ జరిగి మన అకౌంట్ నుండి డబ్బులు పోయినట్లైయితే వెంటనే 1930 కు కాల్ చేయాలని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీదేవి, శ్రీలత, గంగయ్య, షబానా, ప్రభాకర్, షకీల్, ప్రవీణ్, అనూజ, మనోహర్, కిరణ్ మరియు బ్లూ కోట్ సిబ్బంది రాజేందర్ మరియు జలీల్ పాల్గొన్నారు.




