Tuesday, March 17, 2026

*విద్యార్థులతో ఎమ్మెల్యే సాంబన్నఆప్యాయ ముచ్చట్లు* •విద్యార్థులతో ఎమ్మెల్యే ఆసక్తికర పరిణామాలు•విద్యార్థుల మోములో చిరునవ్వులు..

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (పర్చూరు)పర్చూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్నంబొట్లవారిపాలెం గ్రామంలో ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏదుబాడు నుంచి అన్నంబొట్లవారిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విద్యార్థులు ఎమ్మెల్యే సాంబన్న చూసి పరుగులు తీస్తూ అక్కడికి చేరుకున్నారు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ పిల్లలు సెల్యూట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఏలూరి వేరీ గుడ్ మార్నింగ్ అంటూఒక్కొక్కరిని స్కూల్, ఊరు, తరగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఒక్కొక్కరితో ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ,ఏం గేమ్స్ ఆడుతారు అని తెలుసుకున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు సారధ్యంలో విద్యలో పెను మార్పులు చేశారని అన్నారు. నూతనంగా రంగుల యూనిఫా తీసుకొచ్చారని ఎలా ఉందని అడిగారు. దీనికి వారు చాలా బాగుందని.సమాధానం ఇచ్చారు. మరికొందరు నవ్వులతో వాతావరణాన్ని హాయిగా మార్చారు. ఎమ్మెల్యే విద్యార్థుల అభిరుచులు, వారి ఇష్టమైన సబ్జెక్టులు, గేమ్స్, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకున్నారు. పిల్లలు చెప్పిన సమాధానాలపై ఎమ్మెల్యే ప్రశంసలు పలికారు.చిన్నారుల ధైర్యం, మాట్లాడే తీరు, నాయకుడి ఎదుటనూ తమ అభిప్రాయాలు ధైర్యంగా చెప్పడం అక్కడి పెద్దలను ఆశ్చర్యపరిచింది. ఈ అనుహ్యమైన చర్చ కొన్ని నిమిషాలపాటు సాగి, అక్కడి వాతావరణం చిరునవ్వులు చిందించింది. తరం మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం ఎలా ఉండాలో ఈ సమావేశం చక్కగా చూపించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News