నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 16,జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు మహిళలు, విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీ టీం పోలీసులు తెలిపారు. అపరిచిత వ్యక్తుల పట్ల ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన టి సేప్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని షీ టీం పోలీసులు కవిత తెలిపారు. రోజు నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం పోలీసులు కవిత మాట్లాడుతూ… ప్రతిరోజు స్కూలు, కళాశాలకు వచ్చే విద్యార్థులు, మహిళలు టీ సేఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రయాణం చేసే సమయంలో తప్పక ఉపయోగించుకోవాలని తెలిపారు. మహిళలు, బాలికలు ఎక్కువగా తెలిసిన వారితోనే వేధింపులకు గురవుతున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ధైర్యంగా ఉండి షి టీమ్ పోలీసులకు సెల్ 8712670398 కి లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని* ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టించి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని పోలీసులు సూచించారు. అలాగే విద్యార్థులు సెల్ఫోన్ వినియోగానికి దూరంగా ఉండాలని సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల సమయం వృధా తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని సెల్ఫోన్లో తమ ఫోటోలను అప్లోడ్ చేస్తే వాటిని అదునుగా చూసుకుని సైబర్ నేరగాళ్లు డిపి లను అశ్లీలంగా తయారు చేసి మోసం చేస్తారని కావున అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సాధించాలని కోరారు. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరగాళ్లు అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారని అలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు షీ టీం పోలీసులు జ్యోతి, బాలరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

