జ్యోతిబా పూలే, గురుకుల పాఠశాలను తనిఖీ
నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నేటి సాక్షి,నారాయణపేట, జులై 4,
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని ( కోటకొండ కు సంబంధించిన ) పీ.ఎం. శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. ముందుగా కోటకొండ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ ఆ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ లత తో పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల సంఖ్య, విద్యార్థినుల సంఖ్య కు అనుగుణంగా మరుగుదొడ్లు,స్నానపు గదులు ఉన్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల సంఖ్య కు సరిపడా తరగతి గదులు లేవని, అద్దె భవనం కావడంతో యజమానిని అదనపు గదులను నిర్మించాలని కోరినట్లు ప్రిన్సిపల్ కలెక్టర్ కు తెలిపారు. అక్కడే ఉన్న భవన యజమానితో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థినిల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అదనపు గదులను నిర్మించాలని యజమానికి కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వస్తాయని అంతలోపు మీరు అదనపు గదులను నిర్మించాలని యజమానికి చెప్పారు. పాఠశాలలోని పలు తరగతి గదులకు వెళ్లిన కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడారు. పదో తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ గతేడాది సాధించినట్టు ఈ సారి కూడా వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. 600 లకు 600 మార్కులు ఎవరెవరు సాధిస్తారని విద్యార్థినులను ప్రశ్నించగా అందరం 600 మార్కులు తెచ్చుకుంటామని తెలపగా అందుకు తగ్గట్టు సాధన చేయాలని కలెక్టర్ తెలిపారు. తరగతి గదులను పరిశీలించిన తర్వాత అదనపు గదులను నిర్మించాలని మరోసారి భవన యాజమానికి కలెక్టర్ సూచించారు. పాఠశాలలోని వంట సామాగ్రి, బియ్యం బస్తాలను, వంటగదిని ఆమె పరిశీలించారు. మోను ను తప్పక పాటించాలని ఆదేశించారు.vవారానికి ఎన్ని సార్లు నాన్ వెజ్ ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా గల సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాల/ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ పాఠశాల ప్రిన్సిపల్ నాగ మణి మాలతో పాఠశాల/ కళాశాల లో చదువుకుంటున్న విద్యార్థినుల సంఖ్యా వివరాలను తెలుసుకున్నారు. ఇతర మౌలిక వసతి సదుపాయాలు ఏమేమి ఉన్నాయని ప్రశ్నించారు. సుమారు 650 మంది విద్యార్థినులు ఉన్నారని, చిన్న చిన్న సమస్యలు తప్పా మిగతా ఏమీ లేవని ప్రిన్సిపల్ తెలిపారు. ఇంటర్ తరగతి గదికి వెళ్లిన కలెక్టర్ ఎలా చదువుతున్నారని, మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు. డిజిటల్ తరగతి గదిని, పాఠశాల ఆవరణలోని కిచెన్ గార్డెన్ ను ఆమె పరిశీలించారు. పాఠశాల చుట్టూ ఉన్న ప్రహరీ ఎత్తు ఎక్కువ లేకపోవడం కొంత సమస్యగా మారుతోందని ఎత్తు పెంచి నిర్మింప చేస్తే సమస్య ఉండదని ప్రిన్సిపల్ కలెక్టర్ కు తెలిపారు. తర్వాత డైనింగ్ హాల్ కు వెళ్ళి మెస్ రికార్డులను, మెనూ చార్ట్ ను కలెక్టర్ పరిశీలించారు. మోను ను క్రమం తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. ఈ మరికల్ మండల తాసిల్దార్ రామకోటి, మరికల్ మండల ఎంపీడీవో కొండన్న, మరికల్ మండల ఎం పి ఓ పావని, మరికల్ మండలం ఆర్ఐ సుధాకర్ రెడ్డి, మరికల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.