Thursday, March 19, 2026

*విద్యార్థులు నిత్యజీవితంలో సైన్స్‌ను అన్వేషించండి*• *ఎంఈఓ ప్రభాకర్*

నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 21) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. మండలంలోని పలు పాఠశాల విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు నిరంతరం నిత్యజీవితంలో సైన్స్ విషయాలను పరిశీలిస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే విధంగా కొత్త అన్వేషణలను చేయాలని సూచించారు. జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రతి సంవత్సరం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ టాలెంట్ టెస్ట్ లో నంది మేడారం జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులు ప్రథమ స్థానాన్ని పొంది జిల్లా స్థాయికి అర్హత పొందారు. టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు, విజేతలకు ఎంఈఓ ప్రభాకర్ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు మాధవి లత, సైన్సు ఉపాధ్యాయులు ఎస్ కృష్ణ మోహన్, రాజు నాయక్, శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News