నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 10,బాల్య దశ నుండి విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించేటట్టుగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం గోవిందరాజులు విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ నారాయణపేటలో పాఠశాలలో టీ శాట్, టీఎస్ జిహెచ్ఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో మండల స్థాయిలో విజేతలైన విద్యార్థులందరికీ వ్యాసరచన , ఉపన్యాసం క్విజ్ పోటీలలో జిల్లాస్థాయిలో ప్రతిభా పాటవా పోటీ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరవ డిఈఓ గారు విచ్చేసి విద్యార్థులలో అణగిమణిగి ఉన్న అంతర్గత ప్రతిభను వెలికితీయుటకు చక్కని అవకాశమని విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ సాధించాలని అన్నారు .మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాపరమైన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థులు బాల్య దశ నుండి గొప్పగా రాణించాలని సూచించారు . ఉపన్యాసం పోటీ ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం జరుగుతుంది మరియు విషయాన్ని చక్కగా వ్యక్తీకరించడానికి అవకాశం కలుగుతుందని అలాగే వ్యాసరచన మంచి దస్తూరిని విశ్లేషణాత్మకంగా రాసే అవకాశాన్ని కలిగిస్తుందని క్విజ్ కార్యక్రమం ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని చేరటానికి కృషి చేయాలని విద్యార్థులు అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ విద్యాసాగర్ గారు, సీఎంఓ రాజేందర్ గారు జిల్లా మధ్యాహ్న భోజన పథకం ఇన్చార్జి యాదయ్య శెట్టి గారు సెక్టోరల్ అధికారి నాగార్జున రెడ్డి డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ భాను ప్రకాష్ గారు, గారు, టీఎస్ జిహెచ్ఎంసి జిల్లా అధ్యక్షులు నిజాముద్దీన్ గారు, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు, మండల విద్యాధికారులు బాలాజీ గారు, కృష్ణారెడ్డి గారు, అమీరుద్దీన్ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య గౌడ్ గారు ,దత్తురావు , రిటైర్డ్ జిహెచ్ఎం జెట్టి రమేష్ గారు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు జనార్దన్ రెడ్డి గారు, వెంకటస్వామి గారు, నరసింహ గారు, హైమావతి గారు, సూర్యచంద్ర గారు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు క్విజ్ పోటీలో రిజ్వాన్ జెడ్పిహెచ్ఎస్ కోటకొండ, వ్యాసరచనలో కీర్తన జడ్పిహెచ్ఎస్ చిన్నపొర్ల, ఉపన్యాసంలో మహేష్ జెడ్పిహెచ్ఎస్ మొగల్ మడక విద్యార్థులు ఎన్నికైనారు . రాష్ట్రస్థాయికి ఎన్నికైన విద్యార్థులు ఈ నెల 13, 14వ తేదీల్లో టీశాట్ కార్యాలయం హైదరాబాదులో పాల్గొంటారు.





