నేటిసాక్షి, రాయికల్ : ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుండే మంచి అలవాట్లు కలిగి ఉండాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే అభివృద్దిలోకి వస్తారని రాయికల్ ఎస్ఐ సుధీర్‌రావు సూచించారు. మాదకద్రవ్యాల నివారణ అవగాహన వారోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు రాయికల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రగతి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాద్యతగా మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, కానిస్టేబుల్ మనోజ్, ప్రగతి హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.ఫోటో రైటప్: 24RKL02: మొక్కలు పెంపకంపై విద్యార్థులకు ఆవగహన కల్పిస్తున్న ఎస్ఐ సుధీర్‌రావు





