నేటిసాక్షి, మిర్యాలగూడ : బాలుర విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండి కష్టంతో ఇష్టంగా చదువుకొని ఉజ్వల భవిష్యత్ ను నిర్మించుకోవాలని మిర్యాలగూడ అర్భన్ సిడిపిఓ మమత అన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అవంతిపురం తెలంగాణ గురుకుల గిరిజన బాలుర పాఠశాల మరియు కళాశాలలో అర్భన్ సిడిపిఓ మమత ఆధ్వర్యంలో మంగళవారం “నషా ముక్త భారత్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలురు అందరూ ఎలాంటి చెడు వ్యసనాలకి గురికాకుండా, చదువు మీద దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి, ఫోన్ కి బానిస కాకుండా, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని, కేవలం చదువు మీద దృష్టి పెట్టాలని తెలిపారు. అనంతరం మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్య మాట్లాడుతూ, పిల్లలు ఎవ్వరు మాదకద్రవ్యాలకు అలవాటు కావొద్దని, ఈ అలవాటుకి ఎవరైనా ప్రోత్సహించినట్లయితే వారి వివరాలు తెలపాలని, చట్టపరమైన చర్యలు ఉంటాయని, మాదకద్రవ్యాలకి బానిసైతే బంగారు భవిష్యత్తుని కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థులచే నషా ముక్త భారత్ అభియాన్ ప్రతిజ్ఞ ను, మన జిల్లా మరియు రాష్టాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ రాధిక, బ్లాక్ కో-ఆర్డినేటర్ కవిత, అంగన్వాడీ టీచర్లు సుజిత, అంజలి, మణెమ్మ, రూరల్ పోలీస్ కానిస్టేబుల్స్ కీతావుష, అరుణ, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ జాను నాయక్, వైస్ ప్రిన్సిపాల్ రాజారత్నం, కళాశాల మరియు పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.




