Saturday, March 21, 2026

*విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు*•మెగా పిటియం… విద్యా విప్లవానికి శంఖారావం•భావితరాలకు అద్భుత భవిష్యత్తుకు చంద్రన్న కృషి •ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన •దేశంలో ఎక్కడా లేనివిధంగా పిటిఎం •విద్యాశాఖ మంత్రి లోకేష్ పనితీరుకు నిదర్శనం •పాఠశాల వసతుల కల్పనకు కృషి•విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్ల ఏర్పాటు చేస్తాం•వాటర్ ప్లాంట్ నిర్మాణం, డైనింగ్ హాల్ ఏర్పాటు •ప్రహరీ గోడలు నిర్మాణానికి చర్యలు •మార్టూరు జిల్లా పరిషత్ హై స్కూల్ పీటీఎంలో ఎమ్మెల్యే ఏలూరి

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (పర్చూరు)రాష్ట్రంలో భావితరాల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుత అవకాశాలు కల్పించేలా బంగారు బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు.శుక్రవారం మార్టూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం చక్కని ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ విద్యా రంగం సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధిస్తుందని గట్టిగా నమ్మే దార్శనిక నాయకత్వం ఆధ్వర్యంలో, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా రాష్ట్ర చరిత్రలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలను ఒకే వేదికపై ఆత్మీయంగా కలిపే “పాఠశాల పండుగ” కార్యక్రమం “టీచర్స్ మీటింగ్ (మెగా PTM)” రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టిస్తోందని ఈ పండుగ వాతావరణమే యువనేత నారా లోకేష్ అద్భుత పనితీరుకు నిదర్శనం అన్నారు.రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకున్న ఈ పండుగ, విద్యలో నూతన ఒరవడికి సంస్కృతికి బీజం వేసిందన్నారు. తల్లిదండ్రులను పాఠశాలలకు దగ్గర చేసి, విద్యార్థుల అభ్యాస ప్రయాణంలో సమిష్టి జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక బలమైన వేదికగా రూపొందిందన్నారు. కేవలం పాఠశాలలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మెగా పిటియం 3.0ను ఒక భారీ విద్యా మహోత్సవంగా, “విద్యార్థి తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల మహాసమ్మేళనం” గా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు.*కూటమి పాలన – విద్యా వ్యవస్థకు కొత్త వెలుగు*గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల బలహీనపడిన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.పాఠశాలలను విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మొదటి మెట్టుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారన్నారు.పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మేమున్నాం అనే నినాదంతో, తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ, ఈ పండుగను మరపురాని అనుభవంగా మార్చడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.*బడులను ముంచిన జగన్ మామ*ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ సర్కారు.. బడుల రూపురేఖల సంగతి అటుంచితే గత ఐదేళ్లలో లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసిందన్నారు.అసమర్థ విధానాలతో సాగిన వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్ర విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసిందన్నారు. పేదరికం కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లల్ని చదివిస్తే అంతమందికీ రూ.13వేల చొప్పున అర్హులైన 67.27 లక్షల మంది పాఠశాల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో దాదాపు రూ. 10వేల కోట్లు ప్రభుత్వం జమచేసిందన్నారు.మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసి యువ ఉపాధ్యాయులతో విద్యాశాఖను బలోపేతం చేసిందన్నారు.అవినీతికీ, రాజకీయ నాయకుల ప్రమేయానికీ తావులేకుండా 68వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాం. 4,477 మందికి పదోన్నతులు కల్పించిందని వెల్లడించారు.డొక్కా సీతమ్మ’ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు పోషక విలువలు, రుచీ శుచీ కలిగిన ఆహారం అందిస్తోందన్నారు.స్వర్ణాంధ్ర విజన్ – 2047 లక్ష్యంగా విద్యా రంగాన్ని ఆధునికంగా మార్చుతూ, యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.*తనిఖీ చేస్తూవిద్యార్థులతో మమేకమవుతూ*ఉదయం 10 గంటలకు పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ఏలూరి పాఠశాల ఆవరణ మొత్తం కలియతిరిగి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు మరుగుదొడ్ల ,ఆర్వో ప్లాంట్, తక్షణమే అందుబాటులో తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులందరికీ సరిపడేలా డైనింగ్ హాలు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. క్లాస్ రూములకు వెళ్లి విద్యార్థులతో కలిసి ముచ్చటించారు.వారి యోగక్షేమాలుఅడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో వసతులు విద్యా విధానం ర్యాంకింగ్ తదితరు అంశాలపై విద్యార్థులతో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వెల్కమ్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి చిన్ననాటి గురువు నంబెల్ కుమార్ ను పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం ఎమ్మెల్యే ఏలూరి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రూత్ మేరీ జాయ్, ఎంఈవో వస్రంనాయక్, తాసిల్దార్ ప్రశాంతి, ఎంపీడీవో శ్రీనివాసరావు, టోల్గేట్ మేనేజర్ దీపా, ఎస్ఎంసి చైర్మన్ ఇమామ్ వలి ,వైస్ చైర్మన్ ఏసుపాదం సభ్యులు ఆదినారాయణ ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News