నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)కమ్మకండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్, ప్రధానోపాధ్యాయురాలుగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సునీతను ఆ పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు శుక్రవారం దుశ్శా లువా కప్పి, పండ్లు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సన్మానించి స్వాగతాభినందనలు పలికారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీత మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, బోధనలో సులభతరమైన మెలకువలు ప్రదర్శిస్తూ నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు.అదేవిధంగా క్రమశిక్షణతో కూడిన ఎదుగుదల, సంస్కారం నేర్పించేందుకు సన్నహద్ధం కావాలని కోరారు మండలంలోని పాఠశాలల్లో మన పాఠశాల ఆదర్శం కావాలని అన్నారు కార్యక్రమంలో ఎస్.ఎల్.టి. ఏ జిల్లా అధ్యక్షులు దొడ్డ ఉమామహేశ్వర్, ఐ.వెంకటరామయ్య, కృష్ణార్జున రెడ్డి, దిలీప్ కుమార్, బ్రహ్మం ,శ్రీరాములు, కోటేశ్వర బాబు, ముని రాజ, విశ్వనాథం, సుబ్రహ్మణ్యం ,జ్యోతి ,శాంతి, భార్గవి , లీలారాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు