నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారులో మేత కోసం వెళ్లిన మూడు పాడిగేదెలు విద్యుత్ షాక్తో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దండవేని అంతయ్య, మారాసు గంగారాం, గడికొప్పుల మల్లేశంలకు చెందిన గేదెలు మేత కోసం గ్రామ శివారులోకి వెళ్లాయి. అయితే తెగిపడిన విద్యుత్ తీగలతో విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదవశాత్తు వాటికి తగలడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఫోటో రైటప్: 17RKL01: మృతి చెందిన పాడిగేదెలు

