నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జనవరి 17 షార్ట్ సర్క్యూట్తో పూరిగుడి దగ్ధమైన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలు కథనం మేరకు… చౌడేపల్లి మండలం కాగతి పంచాయతీ పలగార్లపల్లికి చెందిన రెడ్డమ్మ పూరి గుడిసెలో నివసిస్తోంది. ఈ క్రమంలో తన కుటుంబంలో వ్యక్తి గుడిసెలో లాప్టాప్ కు కరెంటు నుంచి ఛార్జింగ్ పెట్టుకున్నాడు .శుక్రవారం అర్ధరాత్రి సమయంలో లాప్టాప్ చార్జింగ్ వైరులో ఏర్పడ్డ విద్యుత్ షార్క్యూట్ మూలంగా గుడిసెకు నిప్పంటుకుంది. ఆ సమయంలో గ్రామంలో పండుగ ఉండడంతో గుడిసె నుంచి మంటలు చెలరేగడం గుర్తించిన స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు ఆలోపే ఇంట్లో ఉన్న రూ. 50 వేలు లాప్టాప్ పూర్తిగా కాలిపోయాయి .అంతేకాకుండా నిత్యవసర సరుకులు ఖాళీ అయినట్లు బాధితురాలు రెడ్డమ్మ వాపొయింది ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు గువ్వల రమేష్ రెడ్డిచే ఆర్థిక సాయం : విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి నిరుపేద రెడ్డమ్మకు ఆర్థిక సాయం అందించారు. ఆయన అనుచరులు నాగరాజు రెడ్డి. గంగాధర్ గంగరాజు. తదితరులు బాధితురాలకు నగదును అందించారు

