నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి అక్టోబర్ 18విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొని ఎలాంటి ప్రమాదం సంభవించకుండా పోయిన సంఘటన శనివారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది కర్ణాటక రాష్ట్రం కోలార్ కు చెందిన కొందరు వ్యక్తులు బోయకొండ గంగమ్మను దర్శించుకుని కారులో తిరుగు ముఖం పట్టారు చౌడేపల్లి బోయకొండ ప్రధాన రహదారి అట్లవారిపల్లి వద్ద గల ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొన్నది ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఆపద జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వాహనాలు ఈ మార్గంలో అతివేగంగా వెళుతుంటాయని స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు




