Tuesday, March 17, 2026

*విద్య ద్వారానే జ్ఞానం లభిస్తుంది – జిల్లా అదనపు కలెక్టర్ బీ.ఎస్ లత***జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ బీ.ఎస్ లత*—————————————–జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)………………………………….మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ బీ.ఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.*జిల్లా అదనపు కలెక్టర్ బీ.ఎస్ లత మాట్లాడుతూ*స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్ట మొదటి నెహ్రూ నాయకత్వంలోని క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందీ అరబిక్ బెంగాలీ ఇంగ్లీష్ భాషలలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పండితుడని, 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పని చేశారని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలని ఆశయంతో కులమత బేధాలు లేకుండా పని చేశారని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1992 లో భారతరత్న అవార్డు అందజేసి గౌరవించిందని అదనపు కలెక్టర్ బీ.ఎస్ లత పేర్కొన్నారు. పేదరికం విద్యతో మాత్రమే దూరమవుతుందని భావించి ప్రతి పేదవాడికి విద్య అందే దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు. వ్యక్తిగతంగా మతపరమైన సంప్రదాయాలు పాటిస్తూ మనమంతా భారతదేశంలో భాగమని తెలిపారని అన్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం మైనారిటీ విద్యపై దృష్టి పెడుతూ గురుకులాలను ఏర్పాటు చేసిందని, ప్రత్యేకంగా మైనారిటీ బాలికల విద్య పై దృష్టి సారించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇక్కడ అన్ని కులాలు వర్గాల వారు కలిసి చదువుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ శాఖ అధికారి చిత్రూ,జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News