Friday, March 13, 2026

విధినిర్వహణలో పోలీసులు త్యాగం స్ఫూర్తిదాయకం శాంతియుత సమాజం, పటిష్టమైన శాంతిభద్రతల తోనే అభివృద్ధి సాధ్యం పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్…..విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం….. పేట జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్…….అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలి…….

నేటి సాక్షి,నారాయణపేట అక్టోబర్ 21,విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) ను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు.పోలీసు పరేడ్ గ్రౌండ్లో నీ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య పోలీస్ అధికారులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘవిద్రోహశక్తులచే పోరాడి చనిపోయిన పోలీస్ పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజల సంరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ నిరంతరం 24*7 పనిచేస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణ తో పాటు దేశ అంతర్గత భద్రత ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు. ఏక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే రియాక్ట్ అయి కంట్రోల్ చేయడం జరుగుతుందని చెప్పారు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపారు. అమరులైన పోలీసులకు, వారి కుటుంబాలకు ఎలాంటి అవసరాలు ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అమరులైన పోలీసులకు ప్రత్యేకంగా ఈరోజు నివాళులర్పించడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం నిరంతరం కాపలా కాస్తుంటారాని ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగల్ని కూడా త్యజించి, ప్రజల కోసం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలని సైతం పణంగా పెట్టి ప్రజల కోసం సంఘ విద్రోహశక్తులచే పోరాడి వీర మరణం పొందిన పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత అని తెలిపారు. అక్టోబర్‌ 21, అంటే పోలీసు అమరవీరుల దినం. 1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఇది. ఈ సమరంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. ఆ రోజును పురస్కరించుకుంటూ, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ యోధుల త్యాగాలను స్మరించుకుందాం. దేశ సరిహద్దుల్లో సైనికులు అమరులైన రోజు ఇది. 1959 అక్టోబర్‌ 21న లడఖ్‌ సరిహద్దులో కాపలాగా ఉన్న పదిమంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించడం జరిగింది అప్పటినుంచి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినముగా ప్రభుత్వం పాటిస్తోంది చెప్పారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనడానికి మన రాష్ట్రమే నిదర్శనo. ఈ సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం, అభివృద్ధి. పోలీసుల త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా భౌతిక రక్షణ నుండి, సామాజిక రుగ్మతలను పారద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్షతో, సేవాభావంతో పని చేస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివి చెప్పారు.అమర వీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తేదీ జాతీయ ఐక్యత దినోత్సవం వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహక శక్తుల్లో 191 మంది పోలీసులు అమరులయ్యారు. నారాయణపేట జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో కానిస్టేబుల్ రాజారెడ్డి 2005 సంవత్సరంలో వీర మరణం పొందారు వారి కుటుంబ సభ్యులకు పోలీసు అండగా ఉంటారని తెలిపారు. పోలీస్ ల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు.అనంతరం జిల్లా పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి సావర్కర్ చౌరస్తా మీదుగా సత్యనారాయణ చౌరస్తా నుండి జిల్లా పోలీస్ కార్యాలయం వరకు జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ అంటూ వారికి నివాళులర్పిస్తూ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్, డీఎస్పీ ఎన్ లింగయ్య, పరేడ్ కమాండర్ నరసింహ, సిఐలు శివశంకర్, రామ్ లాల్,రాజేందర్ రెడ్డి, సైదులు, ఎస్.ఐ లు వెంకటేశ్వర్లు, నరేష్, నవీద్, బాలరాజు, భాగ్యలక్ష్మి రెడ్డి, రమేష్, సునిత, అశోక్ బాబు, లు శివశంకర్ శిరీష, మద్దయ్య శ్వేత, ఆర్ముడు రిజర్వు పోలీస్ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News