నేటి సాక్షి, బాపట్ల జిల్లా,(కర్లపాలెం)మొంథా తుఫాన్ కారణంగా బాపట్ల నియోజకవర్గం గణపవరం బాపూజీ కాలనీ సందర్శించిన, ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు రావాలని అలాగే అక్కడ ఉన్నటువంటి వారికి మంగళవారం అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు బాపట్ల జనసేన నాయకులు విన్నకోట సురేష్ వారికి వాటర్ బాటిల్ బ్రెడ్డు బిస్కెట్లు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ; తుఫాన్ రక్షణ చర్యల్లో ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో కృషి చేస్తుందన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ, సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాలకు ఇంచార్జిలుగా నియమించడం, పునరావాస కేంద్రాలతో పాటు ఆరోగ్య రక్షణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో తుఫాను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అన్నారు.. ప్రజలు ఎవరు అధైర్య పడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అత్యవసరమైతే తప్ప బయటకి ఎవరు రావద్దని జిల్లా అధికారుల సూచనలను పాటిస్తూ ఈ రెండు రోజులు సమన్వయం పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తూర్పు సత్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ తులసి కుమారి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు…





