Saturday, March 7, 2026

విమాన ప్రమాద ఘటనపై మైనార్టీ నాయకుల సంతాపం


నేటిసాక్షి, రాయికల్ :
అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న విమాన ప్రమాద ఘటనలో ఆశువులు బాసిన ప్రయాణీకుల మృతిపై రాయికల్ పట్టణ మైనార్టీ నాయకులు శుక్రవారం సంతాపం తెలిపారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానంకూలిపోయిన దుర్ఘటన అత్యంత బాధకరమన్నారు. ఈ ప్రమాదంలో 268 మంది తమ ప్రాణాలను కోల్పోయారని. వారి ఆత్మ శాంతి కలిగేలా మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లింమైనార్టీ ఉపాధ్యక్షుడు షాకీర్, నాయకులు మహమ్మద్ అబ్దుల్ అస్లం మొహమ్మద్ సాబీర్, మదిన మసీద్ ఆఫీస్ సబ్ సద్దాం హుస్సేన్, ఇర్ఫాన్ అలీ, మహమ్మద్ షాకీర్, ఆమీర్, అల్మాస్ తదితరులు పాల్గొన్నారు
ఫోటో రైటప్: 13RKL04: సంతాపం తెలుపుతున్న మైనార్టీ నాయకులు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News