నేటి సాక్షి పాలేరు ,డిసెంబర్ 19 :హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కాలుకు సంబంధించిన శస్త్ర చికిత్స పూర్తి చేసుకొని కూసుమంచి మండల కేంద్రంలో తమ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వెలుగు దినపత్రిక విలేఖరి అంతోటి రామును బీజేపీ నాయకుడు గుండా ఉపేందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.. వారు త్వరగా కోలుకుని యధావిధిగా తన వృత్తిలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నెంబర్ గా గుండా ఉపేందర్ రెడ్డి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న క్రమంలో ఎన్నికల సంబధిత విషయాలు, వార్డు సంబధిత సమస్యలు, కూసుమంచి పట్టణం సమస్యలు ప్రస్తావించడం, వాటి పరిష్కారం మార్గాలను చర్చించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు దామళ్ల కోటి, అడపా శివ, మహమ్మద్ తాహిర్ హుస్సేన్, మండల బీజేపీ నాయకులు పొన్నం ఉపేందర్ నాయుడు తదితరులు పాల్గొనడం జరిగినది.





