నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : కేటిదొడ్డి మండలం కొండాపురం, ఉమిత్యాల, ఉమిత్యాల తండా పాఠశాలలను స్థానిక ఎంఈవో వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంఈఓ ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు ప్రతిరోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా టైం టేబుల్ ప్రకారం పిల్లలకు రోజువారి ఆహారం అందించాలని ఆయన ఉపాధ్యాయులకు తెలియజేశారు అనంతరం టైం టేబుల్ మెనూ కార్డ్ ప్రతి తరగతి గోడపై అతికించాలని ఆ టైం టేబుల్ మెనూ ప్రకారం పిల్లలకు మధ్యాహ్నం భోజనం అందించాలని తెలియజేశారు అనంతరం ఆయా పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ అందజేశారు అదే విదంగా ఉమిత్యాల తండా ప్రధానోపాధ్యాయులు సొంత నిధులతో పాఠశాలలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులను కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు అభినందించారు అనంతరం కొండాపురం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు స్థానిక ఎంఈఓ హాజరైన కొండాపురం గ్రామ ప్రజలకు బడిబాట గురించి అవగాహన కల్పిస్తూ పిల్లలను కాటన్ సీడ్ కూలీలకు తీసుకొనిపోతే కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సి ఆర్ పి పాపయ్య యుగేందర్ పాల్గొన్నారు

