నేటి సాక్షి గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్):*గన్నేరువరం మండల కేంద్రంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాహనదారులను, పాదాచారులను విద్యార్థులు వృద్ధులు రోడ్డుమీదికి రావాలంటే జక్కుతున్నారు. కుక్కల బెడతతో ప్రాణ భయం ఉందని పలుమార్లు అధికారులకు చెప్పిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

