Monday, February 16, 2026

*వీర కాశీ పట్టణంలో శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రం*

*నేటి సాక్షి*తిరుమలాయపాలెం మార్చి 15(రుద్రరాజు). శివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మార్మోనున్న క్షవ క్షేత్రాలు మండల పరిధిలోని పిండిప్రోలు వీర కాశీపట్నం శివాలయంలో అత్యంత అలంకరణ ప్రాయంగా విద్యుత్ కాంతులతో భక్తులకు శివాలయం దర్శనమిచ్చింది ఆలయ కమిటీ ఆలయ వ్యవస్థాపకులు కాశీపట్నం పీఠాధిపతి దేవాలయ ధర్మకర్తలు చైర్మన్ పూజారులు వీరభద్ర స్వామి–( గురుమాత ) సుగుణ గురుస్వామి మడి కంటి శంకర్ —నాగమణి ధర్మపత్నిచే భక్తిశ్రద్ధలతో శివాలయాలను అలంకరించారు. వేకువజామున భక్తులు కాశీ పట్టణ సమీపంలో ఉన్న ఆకేరు లో ఏటి స్నానం ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో శివుని దర్శించుకొని పవిత్ర మనసుతో తమ మొక్కల్ని చెల్లించుకున్నారు. పిండిప్రోలు వీర కాశీపట్నం చైర్మన్ మడి కంటి వీరభద్ర స్వామి శంకర్ స్వామి మాట్లాడుతూ శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి అని ఆ దేవదేవుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే ప్రతి ఒక్కరికి కోరిన కోరికలు తీరుస్తాడని వారు తెలిపారు. వీర కాశీపట్నం శివాలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి ఎక్కువ జాము నుంచే శివ దర్శనానికి వచ్చి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పురోహితులు వేదమంత్రాలు మధ్య భక్తులకు అర్చనలు దీపారాధన అభిషేకాలను నిర్వహించారు. సాయంత్రం 6 గంటల సమయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు శివాలయంలో శివపార్తుల కల్యాణ సందర్భంగా పీటల మీద మడికంటి వీరభద్ర స్వామి సుగుణమ్మ దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణాన్ని దగ్గరుండి వేదమంత్రాల స్వామి వారి కల్యాణాన్ని అత్యంత అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీర కాశీపట్నం ఖమ్మం నరసింహుల పేట కూసుమంచి మోతే మరిపెడ బంగ్లా పరిసర ప్రాంతాల భక్తులు శివాలయాన్ని దర్శించుకొని పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నంద్యాల శ్యాంసుందర్ రెడ్డి… భవాని దంపతులు పిండిప్రోలు గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ చామకూరి రాజు… ఉమారాణి దంపతులు దొండేటి అశ్విని కుమార్…. శ్రీదేవి దంపతులు దొండేటి నిర్మల్ రావు, రామన బోయిన రవి తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News