నేటి సాక్షి గజ్వేల్:—-సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు.వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు.ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.





