నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన స్థానిక రైల్వే స్టేషన్ లోని ఫుట్ ఫాత్ పై జీవచ్ఛవంలా ఉన్నట్టువంటి అనాథ వృద్ధులు చలికి పడుతున్న అవస్థలను ఎప్పటినుంచో స్థానికుడు జల్లా చంద్ర గమనిస్తున్నాడు. వాళ్లకు ఎలాగైనా సాయమందించాలన్న సంకల్పంతో అనాధలు పడుతున్న అవస్థలను స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేష్, ఎస్ ఐ నరసింహుడు, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, ఏపీ & తెలంగాణ విజిలెన్స్ చైర్మన్ తనకంటి వేణుగోపాల్ రెడ్డి, సోంపల్లి సింగల్ విండో మాజీ చైర్మన్ ఎం సదాశివప్ప ల దృష్టికి తీసుకెళ్లాడు. సేవాభావంతో చేస్తున్న మంచి పనిని మెచ్చి తమ వంతు సహకారం కూడా అందిస్తామని స్థానికుడు జల్లా చంద్రకు చెప్పారు. ఆయన పిలుపు మేరకు బుధవారం వీరంతా ఏకమై ములకలచెరువు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకొని వృద్ధ అనాథులను గుర్తించి చలి నుండి రక్షణ కొరకు ములకలచెరువు మండల సిఐ వెంకటేషులు, ఎస్ఐ నరసింహుడు, వేణుగోపాల్ రెడ్డి, సదాశివప్ప చేతుల మీదగా జల్లా చంద్ర దుప్పట్లను ఉచితంగా పంపిణీ చేశాడు. అనాధలకు సేవాభావంతో దుప్పట్లను అందించేందుకు ముందుకొచ్చిన స్థానికుడు జల్లా చంద్రాను సిఐ, ఎస్ఐ కొనియాడారు. ఈయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని తమ వంతు సహకారంగా అనాధలను గుర్తించి సేవా భావంతో తమకు తోచిన సహకారం అందించాలని సి ఐ వెంకటేషులు అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం, జల్లా కుటుంబ సభ్యులు వెంకటేష్, నవీన్, మంజుల, ఆదిమూర్తి, లక్ష్మీనరసమ్మ, మోహన, మురళి, సుస్మిత మరియు షేక్షావల్లి, బి. సురేష్ నాయుడు, బత్తిని కుమార్ తదితరులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~





