Monday, March 9, 2026

*వెంటనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి**దేశం కోసం ధర్మం కోసం అంటూ పేద ప్రజలపై ధరల భారం మోపి ఆదాని అంబానీ లకు లాభం చేయడం నరేంద్ర మోడీ విధానం*

*నేటి సాక్షి సిరిసిల శివకుమార్* సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోషం రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు గతంలో యూపీఏ ప్రభుత్వం హాయంలో 50 రూపాయలు వంట గ్యాస్ ధర పెంచితే ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ లబోదివ మొత్తుకుంటూ 50 రూపాయలు సిలిండర్ ధర పెంచితే పేద ప్రజలు ఎట్లా బతకాలి ఎన్నికలలో ప్రచారం చేస్తూ ఓటు వేసే ప్రతి ఒక్కరూ సిలిండర్కు మొక్కి కాంగ్రెస్కు వ్యతిరేకంగాఓటు వేయాలని అన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు సిలిండర్ ధర వెయ్యి రూపాయల పైచిలుకు పెంచితే ప్రజలపై భారాలు పడవ దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంపాదన దోచుకొని ఆదాని అంబానీలకు అప్పజెప్పడమేనా నీ ధర్మం రోజు.కష్టం చేసుకునే వారి వేతనాలు ఒకపక్క పడిపోతుంటే ధరలు మాత్రం విపరీతంగా పెరిగి ఆకాశానికి అంటుకుంటున్నాయి పేద ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది పెరిగిన ధరల వలన వచ్చే ఆదాయం సరిపోక ఆర్థిక ఇబ్బందులతో అప్పులపాలై కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా కేవలం బడా పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు చేస్తూ ప్రజా సమస్యలను పక్కదో పట్టించే విధంగా ప్రజల మధ్య చిచ్చులు రేపుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది బిజెపి ప్రజలను ఎక్కువ రోజులు మోసం చేయలేరు ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలపై ద్వారాలు వేయకుండా ధరలపై నియంత్రణ నుంచి పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటే ఎల్లారెడ్డి జవ్వాజి విమల జిల్లా కమిటీ నాయకులు శ్రీరాముల.రమేష్ చంద్ర. సిపిఎం జిల్లా నాయకులు మిట్టపల్లి రాజమల్లు ఎలిగేటి రాజశేఖర్ సిరిమల్లె సత్యం. మిగతా రవి.బెజగం సురేష్. ఆడెపురజిత. కుమ్మరి కుంట కిషన్. జిందం కమలాకర్. కోలా శ్రీనివాస్.స్వర్గం శేఖర్. శ్రీరాముల కవిత తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News