Saturday, March 7, 2026

*వెల్మ పై కక్ష సాధింపు తగదు*

నేటి సాక్షి – రాయికల్ ( ఇమ్మడి విజయ్ కుమార్ ) : రాయికల్ పట్టణంలోని వెల్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెల్మ సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని కులాల, సామాజిక వర్గాల, ప్రజలను సమానంగా చూస్తానని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కాగా రాజ్యాంగబద్ధంగా ఆయన చేసిన ప్రమాణాన్ని తరుచుగా విస్మరిస్తూ వెల్మ కులం మీద విరుచుక పడుతూ వెల్మలపై కాక్ష్య సాధింపు కు దిగుతున్నారని వ్యక్తులతో రాజకీయ వైరుధ్యాలు ఉంటే అట్టి వ్యక్తులతో చూసుకోవాలి కానీ పదేపదే వెలుమ కులాన్ని దూషిస్తూవ్యాఖ్యలు చేయడం వలన మా మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై ఇలాగే ప్రవర్తిస్తే ఊరుకోం అనికాంగ్రెస్ పార్టీలో ఉన్న వెల్మ నాయకులు ఆలోచించి రేవంత్ రెడ్డి ని గట్టిగా నిలదీయాలి అని ఇకనైనా మంచి బుద్ధిని నేర్పాలని హితువు పలికారుఆయన రావుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకునేలా చేయాలని సూచించారుఇకనైనా ముఖ్యమంత్రి తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికలల్లో మా వెల్మల సత్తా ఎందో చూపిస్తామని హెచ్చరించారు కేసీఆర్ వేల్మ జాతిలో పుట్టి తెలంగాణ రాష్ట్రం రావడానికి చేసిన కృషి వలన ఆయనను జాతి పితా అని అభిమానులు గౌరవంగా సంబోధిస్తేమీకు వచ్చిన భాధ ఎంది అని ప్రశ్నించారుపదేపదే వెల్మ జాతిని కించపరుస్తూ ఉంటే చట్టపరంగా న్యాయబద్ధంగా వెళ్లేందుకు కూడ వెనుకడుగు వేయమని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్యాల రాజేశ్వర్ రావు, యాచమనేని శ్రీనివాసరావు, సంతోష్ రావు, జకిలేటి హరీష్ రావు, జకిలేటి రాజశేఖర్ రావు, ప్రశాంత్ రావు, యాచమనేని కిరణ్ రావు, లక్మణ్ రావు, దాసరపు వేణు రావు, కరుణాకర్ రావు, దుగ్యాల రమాపతి రావు, దుగ్యాల శ్రీనివాస్ రావు, సాగర్ రావు,రత్నాకర్ రావు మండల వెలమ సభ్యులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News