నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 06 ~అన్నమయ్య జిల్లా :-: జిల్లా కేంద్రమైన రాయచోటి వేదికగా శుక్రవారం జరిగిన అయ్యప్ప స్వాముల గ్రామోత్సవం చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఎక్కడా చిన్న అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడ గొడవలకు తావివ్వకుండా ఆదర్శవంతమైన శాంతియుత వాతావరణంలో హిందూ ముస్లిం ఐక్యతతో సజావుగా సాగిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ఆధ్యాత్మిక శోభాయాత్రలో దాదాపు 1500 నుండి 2000 మంది అయ్యప్ప స్వాములతో పాటు 3200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. పట్టణమంతా భక్తి పార్వస్యం లో తరించిందని ఎస్పీ పేర్కొన్నారు.ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు..———————————-గత అనుభవాల దృష్ట్యా, ఈ గ్రామోత్సవాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బృందం ఒక సవాలుగా స్వీకరించి, అత్యంత ప్రతిష్టాత్మకంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ, రాయచోటి, మదనపల్లె డీఎస్పీల పర్యవేక్షణలో, 13 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, స్పెషల్ పార్టీలు మరియు 340 మందికి పైగా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పని చేసింది. భక్తుల భద్రతను, ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించడానికి డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ, రెవిన్యూ యంత్రాంగం మరియు అధికారుల సహకారం సమన్వయంతో సమర్థవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత హైలైట్ అయిన విషయం హిందూ – ముస్లిం ల మధ్య ఐక్యత.———————————–ఈ గ్రామోత్సవంలో అత్యంత కనుచూపైన అందరినీ ఆకర్షించే దగ్గర విషయం చోటు చేసుకుంది. ఊరేగింపు మార్గంలో ముస్లిం సోదరులు స్వచ్ఛందంగా స్వాగత వేదికలను ఏర్పాటు చేశారు. వారు అయ్యప్ప స్వాములకు మంచినీరు, పండ్ల రసాలు (జ్యూస్), అరటి పండ్లను పంపిణీ చేసి తమ లోని భక్తిని చాటుకున్నారు. ఇరు వర్గాల మత పెద్దలు, యువకులు పరస్పరం గౌరవించుకుంటూ, మత సామరస్యాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు.ఎస్పీ అభినందనలు..————————–ఈ చారిత్రక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, పగలు రాత్రి అనకుండా అంకితభావంతో పనిచేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని ఎస్పీ కొనియాడారు. ప్రశాంత వాతావరణాన్ని కాపాడి, ఐక్యతా భావాన్ని ప్రదర్శించిన రాయచోటి ప్రజలు, అయ్యప్ప స్వాములు, ముస్లిం మత పెద్దలు, యువకులు, మరియు భక్తులందరికీ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..—————————–





