నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులుతొగుట మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో మాఘ మాసం సందర్భంగా జరుగుతున్న గుట్టకింద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా స్వామి వారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి వారి దయతో ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. కార్యక్రమం లో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి,మండల పార్టీ ఉపాధ్యక్షులు బెజ్జనబోయిన అనిల్,గ్రామ పార్టీ అధ్యక్షులు వోలపు నారాయణ,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉల్లెంగుల సాయి ముదిరాజ్,సీనియర్ నాయకులు చిలివేరి రాంరెడ్డి,పంది రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బెజ్జనబోయిన రాములు,ఆత్మ కమిటీ డైరెక్టర్లు మిద్దె సంతోష్,బెజ్జనబోయిన ప్రవీణ్,వార్డ్ సభ్యులు కల్లెపు భాను చందర్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు కొయ్యడి స్వామిచరణ్,నాయకులు పంది నర్సింలు, జంగపల్లి ఆంజనేయులు,ప్రశాంత్,రాజు,మురళి,నాగ, రామ్ చరణ్,స్వామి, కనకయ్య,విలేకర్లు రవీందర్,నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

