Wednesday, March 18, 2026

వేంపల్లి టింబర్ డిపోలో కలప అమ్మకం

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 19 కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కగజ్నగర్ మండలం, కగజ్నగర్ విలేజ్ పరిధిలోని వేంపల్లి టింబర్ డిపోలో 23.12.2025 (మంగళవారం) న ఉదయం 11.00 గంటలకు కలప అమ్మకం కార్యక్రమం నిర్వహించబడనున్నట్లు అటవీ శాఖ తెలిపింది.ఈ కలప అమ్మకాన్ని జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ తిబ్రేవాల్, ఐ ఎఫ్ ఎస్ నిర్వహించనున్నారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఈ అమ్మకం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుందని తెలిపారు.అర్హత కలిగిన కలప వ్యాపారులు, వినియోగదారులు ఈ అమ్మకంలో పాల్గొనవచ్చని, పాల్గొనే వారు ముందుగా నిర్ణయించిన షరతులు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అటవీ శాఖ సూచించింది. కలప రకాలు, పరిమాణం, వేలం విధానం, రిజిస్ట్రేషన్ వివరాల కోసం ఆసక్తి గల వారు వేంపల్లి టింబర్ డిపో కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.అటవీ సంపదను సుస్థిరంగా వినియోగించడమే లక్ష్యంగా ఈ కలప అమ్మకాన్ని నిర్వహిస్తున్నామని, అందరూ సహకరించాలని జిల్లా అటవీ శాఖ అధికారి కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News