Monday, March 16, 2026

*వేంపెంట గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి, ప్రారంభించిన మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ* *సింగపూర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజను తిలకిస్తున్న సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు*

నేటి సాక్షి 16 మార్చి పాములపాడు:-పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామ పంచాయతీ మజరా గ్రామమైన సుంకులమ్మ కొట్టాలలో పల్లె పండగ రెండవ విడతలో భాగంగా 11 లక్షలతో, CC రోడ్ల నిర్మాణానికి మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, నాయకులతో కలిసి భూమి పూజ చేసి, పనులను ప్రారంభించడం జరిగింది. సింగపూర్ దేశంలోని, మా ఇంటి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసి రోడ్డు భూమి పూజ కార్యక్రమాన్ని తిలకించడం జరిగిందని తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేగూర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజ సేవకుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు డాక్టర్ టేకురి నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో సిసి రోడ్లు చాలా ముఖ్యమైనవని, ప్రతి వీధికి మంచి రోడ్లు ఉంటే అందంగా, గ్రామ ప్రజలకు విష సర్పాలు కుట్టకుండా మంచి రక్షణగా ఉంటాయన్నారు. తమ కుటుంబం గ్రామాభివృద్ధిలో అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, నీటిసంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, వేమా రెడ్డి, రమేష్ రెడ్డి,సుంకన్న, బోనాల భాస్కర్, రాముడు, మహానంది, నాగేశ్వర నాయక్, దార జీవన్న, నారాయణ రెడ్డి, ప్రసన్న కుమార్, హుస్సేన్, పెద్ద రాజయ్య, మొగిలి శ్రీను, హుస్సేనయ్య, చిన్న సుబ్బయ్య, జనసేన శేషు, హుసేన్నలం, సురేంద్ర గౌడ్, రామచంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News