నేటి సాక్షి : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు నులక.సుందరాజు, మరియు కాటేపోగు.జయశేఖర్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు తరపున ఇరువురి కుటుంబాలకు 5000/-రూపాయల ప్రకారం ఆర్థిక సాయం అందించారు. ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలని, మీకు అన్ని విధాలుగా తోడుగా వుంటామని ఆయన కుటుంబానికి మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలుసుకొని సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్.టేకూరి.నాగేశ్వరావు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బోనపల్లె సత్యరాజు, ఎంపీటీసీ శివకుమార్, యువరాజు, ప్రసాద్, శ్రీధర్, చిన్నస్వామి ఆచారి, కుటుంబ రావు, రత్నాకర్, వార్డు మెంబర్ లక్ష్మన్న, వేమా రెడ్డి, సుబ్బారావు, గాండ్ల ప్రసాద్, బోనపల్లె వినయ్, జీవన్న, డీలర్ మధు, ప్రసన్న, జనసేన శేషు, ఆంథోనీ, విశ్వనాధం, సునీల్ ఎం.నాగరాజు, జనార్ధన్ నాయక్, ఎస్.నాగరాజు, శ్యామరాజు,సుంకన్న, ఎగ్గొని రాముడు, తాటిపాటి నాయుడు, దార కిరణ్,పక్కిరయ్య, శ్రీను, సుందరాజు, యోసేపు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.





