నేటి సాక్షి 01 మార్చి పాములపాడు :– పాములపాడు:-పాములపాడు మండలంలోని,వేంపెంట గ్రామానికి చెందిన నల్లి పెద్ద సుబ్బమ్మ కి సంబంధించిన 1,22,228/- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య మరియు వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ లు పంపిణీ చేశారు. నాకు సహకారం అందించి, నాకు తోడుగా ఉన్నందుకు వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ కి మరియు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు లకు పెద్ద సుబ్బమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు,బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్,బొమ్మ రాజేష్,టేకూరి శ్రీనివాసులు,వేమా రెడ్డి,రమేష్ రెడ్డి,పెద్ద రాజయ్య, యువరాజు,భాస్కర్,నెంబర్ లక్ష్మన్న,ప్రసాద్, హుస్సైనయ్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, మండల నాయకులు మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం భాషా, భానుముక్కల బండ్లమూరి.వెంకటేశ్వరరావు, బండ్లమూరి.మహేష్, కృష్ణ, ఎర్ర గూడూరు హరినాధ రెడ్డి, మద్దూరు తిమ్మారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.





