నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ ( కోక్కుల వంశీ )
వేములవాడ సివిల్ జడ్జి జ్యోతిర్మయి ఎందరో నేటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు.పురుటినొప్పులు తెలియకుండా..సిజేరియన్ లకు అలవాటు పడుతున్న నేటిమహిళలు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ కే మొగ్గు చూపాలని తాను ఆదర్శవంతంగా నిలిచారు.అదీ..ప్రభుత్వ దవాఖానా లో పురుడుపోసుకుని సమాజానికి చక్కని పిలుపునిచ్చారు.
రెండు సార్లూ నార్మలే!
మొదటి సారిగా వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 16-8-2023 కూతురికి నార్మల్ డెలివరీ ద్వారా జన్మనిచ్చారు..అదే విధంగా..
మళ్ళీ ఇదే ఆస్పత్రిలో 2వ సారి కూడా నార్మల్ డెలివరీ అయ్యారు.ఈసారి ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. నిజంగా మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిన న్యాయమూర్తి.ఈ సందర్బంగా సీనియర్ కోర్ట్ ఏజిపి బొడ్డు ప్రశాంత్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ రవి, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.