నేటి సాక్షి డిసెంబర్ 30 తోగుట ప్రతినిధి వడ్డే నరసింహులుతొగుట : మండలంలోని లింగాపూర్ కు చెందిన యువ నాయకుడు వేముల కిషన్ (42) అకాల మరణం బాధాకరమని మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వేముల కిషన్ ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుకు గురై ఇంట్లోనే ఆకస్మికంగా మరణించారు. అయన మరణ వార్త తెలుసు కొని లింగాపూర్ లో ఆయన భౌతిక కాయనికి నివాళులు అర్పించి వారి కుటుంబీకులను పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు..బి ఆర్ ఎస్ పార్టీ లో కిషన్ క్రియాశీలకంగా పనిచేయడం జరిగిందని గుర్తు చేశారు. కిషన్ మరణంతో భార్యసంధ్య, కుమార్తె కీర్తన, కుమారులు శ్రీకర్, యశ్వంత్, తల్లి కళావతి లు అనాధలయ్యారు.. పరామర్శించిన వారిలో నాయకులు బిక్కునూరి రజిత శ్రీశైలం,తగరం అశోక్,జీడిపల్లి మోహన్ రెడ్డి, డబ్బికారి పెంటోజీ, రామస్వామి, భూపాల్ రెడ్డి, యాదగిరి, స్వామి, తగరం గణేష్, పిట్ల వెంకటేష్, సుతారి రాంబాబు, టంకరి లింగం తదితరులు ఉన్నారు..

