Wednesday, February 11, 2026

*వేసవిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి*

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఫిబ్రవరి 11 రానున్న వేసవిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిపాలన భవనం సముదాయంలోని ఎంపీడీవో, తహసిల్దార్ ,వెలుగు, పశువైద్య కేంద్రాలలో ఆయన ఆయా అధికారులతో సమీక్షించారు.వేసవిలో అధికారులు ప్రజలందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా మంచినీటి సమస్య పరిష్కారం వైపు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ చర్యలు ఎప్పటికప్పుడు చేయించాలని ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అనంతరం ఆయా శాఖల పనితీరును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ,ఎంపీడీవో లీలా మాధవి ,వెలుగు ఏపిఎం సుబ్రహ్మణ్యం ,తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య, పూల చంద్రమౌళి, శ్రీధర్ రాజు, అర్జున్ రాయల్, బోయకొండ సుబ్బు ,సోము, రెడ్డి ,కళ్యాణ్ , ముని, ప్రభాకర్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News