నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా అధ్యక్షతన జరిగిన పార్టీ యువజన విభాగం సమావేశంలో యువనేతలు అందరూ పాల్గొన్నారు. ఆ తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి గారితో జరిగిన సమావేశంలో యువజన విభాగం కమిటీలతో పాటు ముఖ్యనేతలు అందరూ హాజరై పార్టీ పరిస్థితులపై చర్చించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలపై ఆయనకు సుదీర్ఘంగా వివరించారు. అనంతరం ఇప్పటి వరకు చేసిన ప్రజా ఉద్యమాలను, సాధించిన పురోగతి తదితర అంశాలపై అందరూ కలసి చర్చించడం జరిగింది.. ఈ సమావేశంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరవగా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లు బైరెడ్డి సిద్దార్థ్రెడ్డి, కారుమూరి సునీల్ కుమార్, అన్నంరెడ్డి అదీప్ రాజ్, వైస్ ప్రెసిడెంట్లు స్వరూప్, షేక్షాఫుల్ల, మెరుగు చందన్, ప్రతుల్, జోనల్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు…




