డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఘన నివాళి
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లామహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ చిత్రలేఅవుట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు సమర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ:-ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ నేతల్లో వైఎస్సార్ అగ్రగణ్యులు.మండు వేసవికైనా లెక్కచేయకుండా పాదయాత్ర చేసి రాష్ట్రానికి అభివృద్ధిని,కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారాన్ని తీసుకొచ్చారు.ఆయన పేరు గుర్తుకు రాగానే మనకెదురవ్వేది పంచెకట్టు,అది ఆయన తెలుగు సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవానికి నిలువెత్తు చిహ్నం.రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ పంచెకట్టును తన దైన డ్రెస్ కోడ్‌గా మార్చుకున్నారు.పేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన నేత ఆయన,అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.