నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామపంచాయతీ చిత్రలేఅవుట్లో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల యాదయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆవుల యాదయ్య మాట్లాడుతూ:-ప్రజాసేవకు తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ నాయకుల్లో వైఎస్సార్ అగ్రగణ్యుడు అని కొనియాడారు.రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించిన ధీశాలి ఆయనేనని,కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు.పంచె కట్టే ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్,డబ్లుగూడ గ్రామ శాఖ అధ్యక్షులు బొర్రా దయాకర్,మాణిక్యమగూడ ఇంద్రమ్మ కమిటీ అధ్యక్షులు బొడ్డుమని దావీదు,కమ్మరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.





