బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేశ్..నేటిసాక్షి ప్రతినిధి రుద్రంగి:రుద్రంగి మండలానికి వైకుంఠ రథం మంజూరు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపిన బిజెపి నాయకులు,గ్రామ ప్రజలు.ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ రుద్రంగి లోని స్మశాన వాటిక దూర ప్రాంతంలో ఉందని ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి వైకుంఠ రథాన్ని అందజేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కూరగాయల మార్కెట్ కేంద్రమంత్రి బండి సంజయ్ నిధులతో కట్టడం జరిగిందని,కేంద్ర ప్రభుత్వ ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులకు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన అదే సిసి రోడ్డు పనులకు మళ్ళీ స్థానిక కాంగ్రెస్ నాయకులు భూమిపూఎమ్మెల్యే చేయడం విడ్డురంగా ఉందని అన్నారు. పేదలకు ఇచ్చే సన్నబియ్యం మోదీ మూడు నెలలకు కలిపి ఒకేసారి ఇచ్చారని, రుద్రంగి లో నిర్మించే సిసిరోడ్లు, డ్రైనేజ్ లు, ఇందిరమ్మ 9ఇండ్లు, కేంద్ర ప్రభుత్వ నిధులేనని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదని ఆరోపించారు. నిరుపేదలకు ఇవ్వాల్సిన పథకాన్ని ఆర్థికంగా ఉన్నవారికి ఇస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే తన ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నాడని ప్రజలు గ్రహించాలని మోసపూరిత కాంగ్రెస్ మాటలతో ఆరు గ్యారంటీలను మోసం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కర్ణవత్తుల వేణుగోపాల్, బిజెపి సీనియర్ నాయకులు పడాల గణేష్, బోయిని రాజు,గడ్డం రవీందర్, పెద్ది శ్రావణ్,గడ్డం గణేష్ , గండి శ్రీను,పడాల గజనందు, పడాల నరేష్,బొబ్బిలి గణేష్,అక్కెనపెల్లీ నర్సింగరావు, బోండ్ల వినయ్, మేకల సురేష్, లింగంపల్లి నవీన్, లింగంపల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

