నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*తిరుపతి, నవంబర్ 25 :* వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, జాతీయ రహదారులు, క్రిష్ సిటీ , ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించి అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు, క్రిష్ సిటీ, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించి అంశాలు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో, తిరుపతి, శ్రీ కాళహస్త్రి, సూళ్ళూరుపేట, ఆర్డిఓలు రాం మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, ఏపిఐ.సిడిసి సిఈ, నాగబూషణం, క్రిస్ సిటీ పి డి ఆంజనేయులు, ఏపిఐఐసి నెల్లూరు జడ్ఎం ఎల్. శివకుమార్, జాతీయ రహదారుల పిడి లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు, కాంట్రాక్టర్లు,తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తిరుపతి జిల్లాలో వైజాగ్ చెన్నై కారిడార్ పైపు లైను పనులు, జాతీయ రహదారులు, క్రిష్ సిటీ కి సంబంధించి భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి శ్రీ సిటీ లోని పేస్ -1, పేస్ -2 సంబంధించి అంశాలు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, నిర్మాణ పురోగతి పనులపై పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ లను ఆదేశించారు. అలాగే అందరూ కలసి సమన్వయంతో పెండింగ్ పనులను నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలన్నారు. ఏపీఐఐసీ ప్యాకేజీ 5, నేషనల్ హై వే ప్యాకేజ్ 2,3,4 ఎడిబి రోడ్లు పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, కృష్ణపట్నం పవర్ కార్పోరేషన్ అధికారి హర్షవర్ధన్ రెడ్డి, క్రిస్ సిటీ అధికారి చెన్నకేశవులు, భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





