నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామ శివారులోని యధాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం శ్రీ శ్రీ సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలాబ్ నాయక్, సర్పంచ్ నేనావత్ శ్రావణి నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, భోగ్ బండార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం వైటీపీఎస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ మరియు డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైటిపిఎస్ ఉద్యోగులు, గిరిజన సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

