నేటి సాక్షి, దమ్మ శ్రీధర్, (మంచిర్యాల్) నవంబర్ 20మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ లో కార్తీక్ అనే బాలుడు మృతి చెందాడు, కాజీపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన శేఖర్ సౌందర్యల కుమారుడు, కార్తీక్ ని సోమవారం ఉదయాన్నే నంజు కారణంగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మూడు రోజుల ట్రీట్మెంట్ తర్వాత బాలుడు చనిపోవడం జరిగింది,ఇది తెలుసుకున్న బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే బాలుడు చనిపోయాడని ఆందోళనకు దిగారు, బాలుడి మరణాన్ని గోప్యంగా ఉంచడంలో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట బైఠాయించి, న్యాయం కావాలి చర్యలు తీసుకోవాలని డిమాండ్, చేశారు పోలీసులు హాస్పిటల్కి చేరుకొని విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.





